
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు(ఆదివారం) 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యోగి మద్దతుదారులు 111 అడుగులతో ఓ కేక్ ను రూపొందించారు. దీనితో 108.27 అడుగుల పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. ప్రపంచంలోనే అతి పొడవైన కేక్ ను కట్ చేయించి రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఈ కేక్ ను రూపొందించారు.
ఆదివారం సాయంత్రం నవాబ్‌గంజ్ అసెంబ్లీ పరిధిలో ఈ కేక్ ను కట్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి చేసిన కృషికి గాను ఈ కేక్‌ను ‘పీస్ ఆఫ్ కేక్ ’గా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్‌కు 50వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్‌ను డైనమిక్ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు. యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా అయోధ్యలో 5 లక్షల మంది హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు.