శ్రీశైలం : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చారు. ఆయనకు భ్రమరాంబ అతిథి గృహం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ రాత్రికి శ్రీశైలంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
