PM మోడీ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్: తొలగిన ఆటంకాలు

PM మోడీ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్: తొలగిన ఆటంకాలు

ఢిల్లీ : PM నరేంద్రమోడీ బయోపిక్ విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. మూవీ విడుదల ఆపుతూ ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీం బెంచ్ కొట్టివేసింది. సెన్సార్ బోర్డ్ ఇంకా పీఎం నరేంద్రమోడీ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదని బెంచ్ తెలిపింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను మూవీ ఉల్లంఘిస్తుందా లేదా అన్నది ఎలక్షన్ కమిషన్ తేల్చుతుందని అభిప్రాయపడింది.

సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయని పీఎం నరేంద్రమోడీ సినిమా యూనిట్ తెలిపింది. టైటిల్ రోల్ పోషించిన వివేక్ ఒబెరాయ్.. దీనిపై ట్విట్టర్ లో ఓ ప్రకటన చేశారు. ఏప్రిల్ 11న పీఎ నరేంద్రమోడీ సినిమా విడుదల కాబోతోందని ప్రకటించారు. “మీ ఆశీస్సులు, మద్దతు, ప్రేమతో… ఇవాళ సుప్రీంకోర్టులో మేం గెలిచాం. భారత న్యాయవ్యవస్థకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంపై మాకివాళ నమ్మకం మరింత పెరిగింది. ఏప్రిల్ 11న కలుద్దాం. జై హింద్” అని చెప్పారు వివేక్ ఒబెరాయ్.

ఏప్రిల్ 11న సినిమా విడుదల చేస్తామని ఏప్రిల్ మొదటివారంలో చిత్రయూనిట్ ప్రకటించింది. ఐతే.. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో.. రిలీజ్ విషయంపై కొంత అనుమానం కలిగింది. తాజాగా సుప్రీంకోర్టు ఆటంకాలు తొలగిపోవడంతో.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా… ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. సందీప్ సింగ్, సురేష్ ఒబెరాయ్, ఆనంద్ పండిట్, ఆచార్య మనీష్ నిర్మాతలు. పీఎం మోడీ బయోపిక్ ట్రైలర్ ఇప్పటికే ఇంటర్నెట్ లో సెన్సేషన్ సృష్టించింది.