
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీని మరోసారి పొడిగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. చిదంబరం కస్టడీపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ(సోమవారం) విచారించిన సుప్రీంకోర్టు చిదంబరం రిమాండ్ ను సెప్టెంబర్ 5 వరకు పోడిగించింది. చిదంబరం తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చిదంబరం ఆరోగ్యం దృష్ట్యా ఆయనను జైలుకు పంపకుండా.. బెయిల్ మంజూరు చేయాలని సూచించారు. లేకపోతే ఆయనను హౌస్ అరెస్ట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది సుప్రీం కోర్టు. అయితే చిదంబరాన్ని జైలుకు పంపకుండా మరో మూడు రోజులు రిమాండ్ పొడగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.