జైలుకు పంపాక ఆర్డర్స్ అమలు చేస్తారా ?: సుప్రీం కోర్టు

జైలుకు పంపాక ఆర్డర్స్ అమలు చేస్తారా ?: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సంస్థల తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి  చేసింది. సీనియారిటీ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును  జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ద్విసభ్య  ధర్మాసనం విచారణకు చేపట్టింది. కోర్టు ఆదేశాలతో విధుల్లోకీ తీసుకున్న ఏపి విద్యుత్ ఉద్యోగుల సీనియారిటీ అంశంలో అలసత్వం ప్రదర్శించినందుకు తెలంగాణ విద్యుత్ సంస్థ లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జైలుకు పంపాక ఆర్డర్స్ అమలు చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది.  

రాష్ట్ర విద్యుత్తు సంస్థల తరఫున  సీనియర్ అడ్వకేట్లు గిరి, రంజిత్ కుమార్, రాకేశ్ ద్వివేదిలు వాదించారు. కోర్టు ఆదేశాలతో ఏపికి చెందిన 84 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటూ బకాయిలు చెల్లించినట్లు వారు  బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల గడువు ఇవ్వాలని  వారు కోర్టును కోరారు. ఉద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ వాదించారు.