సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.  పరువు నష్టం కేసులో గుజరాత్  కోర్టు ఇచ్చిన తీర్పుపై 2023 ఆగస్టు 04న  సుప్రీంకోర్టు స్టే విధించింది.  కాగా  సూరత్ కోర్టు 2023  మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

2019 కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటిపేరు గురించి చేసిన వ్యాఖ్యలపై   గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ  రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు. సూరత్‌ కోర్టు రాహుల్‌గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ  రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. 

 రాహుల్‌ గాంధీ వేసిన  పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2023 జూలై 21 శుక్రవారం రోజున విచారించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, పీకే మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు .. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం 2023 ఆగస్టు4 కు విచారణను వాయిదా వేసింది.  రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.