అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నికలు జరపండి: సుప్రీంకోర్టు

అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నికలు జరపండి: సుప్రీంకోర్టు
  • అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నికలు జరపండి
  • హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం, నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడ గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2020లో నందిగామ పంచాయతీ నుంచి అంతిరెడ్డిగూడ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత తమ గ్రామానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక ప్రజలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై వాదనలు విన్న హైకోర్టు బెంచ్​ అంతిరెడ్డిగూడ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలు వరించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నందిగామకు చెందిన వెంకట్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్​ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్​ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి పం చాయతీకి ఎన్నికలు నిర్వహించినందున ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవస రం లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.  వాదనలు విన్న బెంచ్​.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆ తీర్పునకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.