పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు

పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు

ఢిల్లీ : పతంజలి సంస్థపై సుప్రీం కోర్టు మరోసారి సీరియస్ అయింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారనే కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఇంకోసారి విచారణ చేపట్టింది. ప్రముఖ వార్తాపత్రికలలో ప్రచురించిన క్షమాపణలు.. తప్పుదారి పట్టించే ప్రకటనలు ఒకే సైజులో ఉన్నాయా అని పతంజలిని ప్రశ్నించింది. 

అయితే తాము క్షమాపణ ప్రకటనల కోసం రూ.10లక్షలు ఖర్చు చేసి 67 వార్త పత్రికల్లో ప్రచురించామని సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ..  కోర్టుకు నివేదించారు. 

ప్రకటనలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ఉంచాలని ఆదేశిస్తూ.. విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది జస్టీస్ హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం. ఇవాల్టి విచారణకు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.