
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఆమె వేసిన పిటిషన్విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఆ కేసులో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె లోక్‌సభ సభ్యవత్వాన్ని రద్దు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహువా ఫైల్స్‌ను ఇప్పుడు స్టడీ చేయలేమని, వింటర్ బ్రేక్ తర్వాత జనవరి3న విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది.