స్వలింగ వివాహాలపై పార్లమెంట్ దే నిర్ణయం : సుప్రీంకోర్టు

స్వలింగ  వివాహాలపై పార్లమెంట్ దే నిర్ణయం : సుప్రీంకోర్టు

స్వలింగ వివాహాల చట్టబద్దతపై సుప్రీంకోర్టు ధర్మాసనం వేర్వుగా తీర్పులు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్నసీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. హోమో సెక్సువాలిటీ టౌన్ లకో, ఉన్నతవర్గాలకు పరిమితం కాదని చెప్పారు. స్వలింగ జంటల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు..వారి అధికారాల విభజనకు అడ్డంకికాదని ధర్మాసనం చెప్పింది. 

అయితే ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలన్నసీజేఐ..శాసనసభ పరిధిలోకి రాకుండా చూడాలని చెప్పారు. సెక్సువల్ ఓరియంటేషన్ ఆధారంగా సంఘాల్లో చేరేందుకు వారి హక్కులను అడ్డుకోలేమన్న ధర్మాసనం.. టాన్స్ జెండర్ లు ప్రస్తుత చట్టాల ప్రకారం మ్యారేజ్ చేసుకునే హక్కు ఉందని చెప్పింది. క్వీర్, అవివాహిత జంటలు చిన్నారులను దత్తత తీసుకోవచ్చని తెలిపారు. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపరాదన్నసీజేఐ అందరినీ ఈక్వల్ గా చూడాలని చెప్పారు. ఆర్టికల్ 21 ప్రకారం ఫ్రీడం, ఈక్వాటీ హక్కుల మేరకు జీవిత భాగస్వామ్యంను ఎంచుకునే హక్కు ఉంటుందని ధర్మాసనం చెప్పింది.

స్వలింగ వివాహనికి చట్టబద్దత లేదని.. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించబోమని సుప్రీం తెలిపింది. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించింది. కలిసి జీవించడాన్ని గుర్తిస్తున్నామని చెప్పింది. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్ట బద్ధత కల్పించలేమని తీర్పునిచ్చింది.  శాసన వ్యవస్థలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

ALSO READ : స్వలింగ సంపర్కుల వివాహాలు సరైనవేనా..? నేడు (అక్టోబర్​ 17న) సుప్రీంకోర్టు తీర్పు


స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ... దాఖలైన పిటిషన్ లపై విచారించిన సుప్రీంకోర్టు..మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. సీజేఐ జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది