బ్రిడ్జి ఘటనపై నవంబర్ 14న సుప్రీంలో విచారణ

బ్రిడ్జి ఘటనపై నవంబర్ 14న సుప్రీంలో విచారణ

గుజరాత్ మోర్భీ జిల్లాలోని మచ్చ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించేలా ఆదేశించాలని ఈ పిల్ లో పేర్కొన్నారు. పాత వంతెనలు, స్మారక కట్టడాల భద్రతను నిర్ధారించేందుకు సర్వే, రిస్క్ అసెస్మెంట్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించాలని పిటీషనర్ పేర్కొన్నారు. ఈ విచారణను నవంబర్14 న ధర్మాసనం విచారించనుంది. 

మోర్బీ లోని కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని సదర్శించనున్న ప్రధాని మోడీ ఇయ్యాళ సందర్శించనున్నారు. అనంతరం ఘటన జరిగిన తీరును అధికారులు, ప్రధానికి వివరించనున్నారు. ఇదిలా ఉండగా కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటివరకు141 మంది మృతి చెందారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.