కాళేశ్వరం భూనిర్వాసితుల కేసులో సర్కారుకు సుప్రీం ఆర్డర్

కాళేశ్వరం భూనిర్వాసితుల కేసులో సర్కారుకు సుప్రీం ఆర్డర్

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన గంగాజమున, శ్రీరామ్, పలువురు బాధితులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్​ను జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ జె.బి. పార్దీవాలాతో కూడిన బెంచ్ విచారించింది. అత్యధిక మంది నిర్వాసితులు ఇప్పటికే పరిహారం తీసుకునేందుకు ఒప్పుకున్నారని బెంచ్‌‌కు రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది సీసీ వైద్యనాథన్ వివరించారు. చాలా మంది పరిహారం తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్ల తరఫు న్యాయవాది విభేదించారు. దీంతో ధర్మాసనం మధ్యలో జోక్యం చేసుకుంటూ... పెద్ద సంఖ్యలో నిర్వాసితులు నష్ట పరిహారానికి ఒప్పుకున్న తర్వాత సమస్య ఏంటని వైద్య నాథన్ ను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో వారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... విచారణను 18కి వాయిదా వేసింది.