
అత్యాచారం కేసులో నిందితుడికి హైకోర్ట్ ఉరిశిక్ష విధించింది. గతేడాది అక్టోబర్ లో బీహార్ కు చెందిన అనిల్ యాదవ్(22) సురత్ లో తన మామయ్య కూతురైన మూడేళ్ల చిన్నారిని అపహరించాడు. ఓ పాడుబడ్డ బిల్డింగ్ లో అత్యాచారం చేసి హతమార్చాడు. చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. అయితే సూరత్ నుంచి బీహార్ కు ఎస్కేప్ అయిన నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్ట్ లో ప్రవేశపెట్టారు.
విచారణ చేపట్టిన సూరత్ ప్రత్యేక కోర్ట్ అనిల్ యాదవ్ కు ఉరిశిక్ష విధించింది. 38 మంది సాక్షులు వాంగ్మూలం, అత్యాచారం, హత్య చేసినట్లు వైద్యపరిక్షల్లో తేలడంతో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.