World Cup 2023: అప్పుడు రోహిత్ చేసింది ఇప్పడు గిల్ చేస్తాడు: సురేష్ రైనా

World Cup 2023: అప్పుడు రోహిత్ చేసింది ఇప్పడు గిల్ చేస్తాడు: సురేష్ రైనా

టీమిండియా యువ సంచలనం శుభమాన్ గిల్ చాలా తక్కువ కాలంలోనే క్రికెట్ లో తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నాడు. గిల్ ఫామ్ చూస్తుంటే వన్డేల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనబడుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 1000 కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న ఈ పంజాబ్ స్టార్.. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో టాప్ స్కోరర్ గా  నిలిచాడు. ప్రస్తుతం గిల్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా.. గిల్ ఆటను కొనియాడాడు. 

2019 లో రోహిత్ సీన్ గిల్ రిపీట్ చేస్తాడు 

ఇంగ్లాండ్ వేదికగా 2019 లో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా 5 సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే . టోర్నీ మొత్తానికే రోహిత్ పరుగుల ప్రవాహం హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సారి ఆ సీన్ గిల్ రిపీట్ చేస్తాడని రైనా ఆశాభావం వ్యక్తం చేసాడు. భవిష్యత్తులో కోహ్లీని రీప్లేస్ చేసేది కూడా గిల్ అని ఈ సందర్భంగా రైనా చెప్పుకొచ్చాడు.    

ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా రేపు తొలి వన్డే మొహాలీ వేదికగా జరుగుతుంది. కాగా.. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మూడు వన్డేల సిరీస్ లో గిల్ 200 పరుగులు చేస్తే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ని దాటి అగ్ర స్థానంలోకి వస్తాడు.