సూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో మరొకరు అరెస్ట్ ..25 తులాల బంగారం ... రూ.4,84,500 స్వాధీనం

సూర్యాపేట  గోల్డ్ చోరీ కేసులో మరొకరు అరెస్ట్ ..25 తులాల బంగారం ... రూ.4,84,500  స్వాధీనం
  • సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ వెల్లడి

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21న శ్రీసాయిసంతోషి జువెలరీ షాపులో జరిగిన భారీ గోల్డ్ చోరీ కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 25 తులాల బంగారం, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.  శుక్రవారం ఎస్పీ కె.నరసింహ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు.  

గోల్డ్ చోరీ కేసులో ఏ5 నిందితుడు జంషిముద్దీన్‌ను పట్టుకునేందుకు సూర్యాపేట టౌన్ సీఐ వెంకటయ్య, సీసీఎస్‌ సీఐ శివ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లింది. ఈనెల 26న మాల్డా జిల్లా రత్వా పీఎస్ పరిధిలో నిందితుడు జంషిముద్దీన్‌ను అదుపులోకి తీసుకుంది. అతడిని ట్రాన్సిట్ వారెంట్ పై (రాష్ట్రాల బదిలీ) సూర్యాపేటకు తీసుకొచ్చింది. 

రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన గోల్డ్ చోరీ కేసులో ఏడుగురు నిందితులను గుర్తించగా.. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.