రాజస్థాన్​లో మోదీ హవా: సర్వేలో వెల్లడి

రాజస్థాన్​లో మోదీ హవా: సర్వేలో వెల్లడి
  • ఎన్డీటీవీ లోక్ నీతి ప్రీ పోల్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: రాజస్థాన్ లో ప్రస్తుతం ప్రధాని మోదీ గాలివీస్తోందని, రాష్ట్రంలోని ఓటర్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈమేరకు ఎన్డీటీవీ-సీఎస్​డీఎస్​లోక్ నీతి ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 3 వేల మందిని ప్రశ్నించి ఈ వివరాలను రాబట్టినట్లు తెలిపింది. గెహ్లాట్​ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేవలం 24 శాతం మంది మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ మోదీ హవా ప్రభావం ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తుందని పేర్కొంది. ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్​లలో ఎవరికి మద్దతు తెలుపుతారన్న ప్రశ్నకు 37 శాతం మంది మోదీకి, 32 శాతం మంది గెహ్లాట్​కు ఓటేశారని సర్వే నిర్వహించిన ఎన్డీటీవీ లోక్ నీతి తెలిపింది.