Surya Grahan 2023: ఈ ఏడాదిలో ఏప్రిల్ 20న ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం

Surya Grahan 2023: ఈ ఏడాదిలో ఏప్రిల్ 20న ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం

ఏప్రిల్ 20, గురువారం ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సాధారణంగా సూర్యుడు తన కక్ష్యలో ప్రయాణిస్తుండగా.. చంద్రుడు, సూర్యుడుకి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహానికి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఏమి చేయాలో,  ఏమి చేయకూడో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు

సూర్యగ్రహణం సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు . ఈ సమయంలో ఏమేం పనులు చేయడం చేయకూడదంటే..

  • సూర్యగ్రహణం రోజున ముందుగా తయారుచేసిన ఆహారాన్ని నిల్వ ఉంచి, తినరాదు. గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసి, ఆపై ఆహారాన్ని వండుకుని తినాలి.
  • సూర్యగ్రహణానికి ముందు ఆహారం వండినట్లయితే, అందులో తులసి ఆకులను వేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం ఆహారంపై ప్రభావం చూపదని నమ్ముతారు.
  • సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ కంటితో చూడకూడదు. ఇలా చేయడం వల్ల హాని కలుగే ప్రమాదం ఉంది.
  • గ్రహణ సమయంలో నిద్ర లేదా ప్రయాణం చేయకూడదు.
  • సూర్యగ్రహణం సమయం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించకూడదు.
  • వీలైతే, ఈ సమయంలో మలవిసర్జనకు దూరంగా ఉండండి. 
  • సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండండి. బయటికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు కలుషితమవుతాడనే భావన ఉంది. కాబట్టి ఇది మనుషులపై  ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటుంటారు.

గ్రహణం సమయంలో ఈ పనులు చేయొచ్చు

  • సూర్యగ్రహణానికి ముందు తులసి ఆకులను నీటిలో వేసి, మిగిలిన ఆహారాన్ని పడేయండి.
  • సూర్యగ్రహణం సమయంలో శివునికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి.
  • సూర్యగ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి మంత్రాలను పఠిస్తూ దానధర్మాలు చేయాలి.
  • సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి.
  • గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  • గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి.
  • సూర్యగ్రహణం సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  • హిందూ పంచాంగం ప్రకారం, ఈ గ్రహణం ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. అయితే భారతదేశంలో కనిపించనందున సూతక్ కాలం దేశంలో చెల్లదు.