
ఏసీబీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఫిషింగ్ ఆర్డర్స్ రిలీజ్ కోసం సొసైటీ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు తమ గోడు వినమని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లారు. రేపు సూర్యాపేట నుండి బదిలీ అయ్యి వెళ్లిపోతుండటంతో అధికారులు పక్కాగ ప్లాన్ వేసి పట్టుకున్నారు.
ఏసీబీ వేసిన ట్రాప్ లో పడ్డ రూపేందర్ సింగ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి రూపేందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. గతంలో కూడా పలుమార్లు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. అయినా సరే పద్దతి మార్చుకోకుండా డబ్బు మీద వ్యామోహంతో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి చిక్కారు.