రైతులకు తప్పనున్న ఇబ్బందులు : వేణారెడ్డి

రైతులకు తప్పనున్న ఇబ్బందులు : వేణారెడ్డి
  • మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట, వెలుగు : ఆటో మెటిక్ పాడీక్లీనర్ తో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఆటో మెటిక్ పాడీ క్లీనర్ పనితీరును ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 

జిల్లాలో 116 ఐకేపీ సెంటర్లకు ప్రస్తుతం 300 పాడీ క్లీనర్లు పాతవి ఉన్నాయని, 60 అధునాతన యంత్రాలను తీసుకొస్తామని తెలిపారు. పాత క్లీనర్లను రూ.60 వేల ఖర్చుతో అధునాతనంగా మార్చే అవకాశం ఉందన్నారు. డీఎస్ వో మోహన్ బాబు, డీఎంవో సంతోష్, మార్కెట్ సెక్రటరీ ఫసియొద్దీన్, యూడీసీ ఖాసీం, ఏఈడబ్ల్యూ గ్రూప్ ఫ్యాక్టరీ ఇన్​చార్జి రాగేశ్  పాల్గొన్నారు.