
సూర్యాపేట, వెలుగు: అనవసరమైన లింక్‌లు ఓపెన్ చేసి సైబర్ మోసాల బారిన పడొద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తిరిగి జమ చేయించిన డబ్బులను కోర్టు ఉత్తర్వులను ఎస్పీ అందజేశారు. ముగ్గురి బాధితులకు రూ.28 లక్షల నగదు తిరిగి వారి అకౌంట్‌లో జమచేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుడు సిమెంట్‌లారీలు ట్రాన్స్ పోర్ట్ చేసే వ్యక్తి తన మొబైల్‌ఫోన్‌కు బ్లూ లింక్ ద్వారా బిజినెస్ ఆఫర్ ఉందని మెసేజ్ వచ్చింది. సైబర్ మోసగాళ్లు నకిలీ అకౌంట్‌సృష్టించి అందులో డబ్బు జమ అవుతున్నట్లు నమ్మించారన్నారు.
బాధితుడు అప్పులు చేసి, బంగారం తాకట్టుపెట్టి సుమారు రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అనంతరం సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ సెక్యూరిటీ టోల్‌ఫ్రీ నెంబర్1930 ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి.. అకౌంట్ నుంచి బదిలీ అయిన రూ. 26.42 లక్షల నగదును హోల్డ్ చేయించారు. మహారాష్ట్ర కు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్- వెస్ట్ బెంగాల్‌కు చెందిన బంధన్ బ్యాంక్ వినియోగదారుల ఖాతాకు బదిలీ అయిందని గుర్తించి ఆ అమౌంట్‌ను కోర్టు ఆర్డర్స్ ద్వారా తిరిగి బాధితుడికి ఇప్పించామన్నారు.
మరో కేసులో మోసపోయిన వ్యక్తికి రూ. 51 వేలు, మరో వ్యక్తికి రూ.90వేలు తిరిగి వారి అకౌంట్‌లో వేయించామన్నారు. సైబర్‌సెక్యూరిటీ సెల్‌ఇన్సె్పక్టర్ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ మహేష్, కానిస్టేబుల్ మహేష్ చారి, రాజేష్, సైదులు, నాగయ్య పాల్గొన్నారు.
ఘనంగా ఆయుధ పూజ
సూర్యాపేట, వెలుగు: దసరా నవరాత్రుల సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఆయుధాలకు, పోలీస్ వాహనాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు ఆయుధ పూజా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ లు ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.