
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని వావిలాలపల్లికి చెందిన ఎన్.శృతిహర్షిత డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో స్టేట్ 14వ ర్యాంకు సాధించి, వరంగల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయింది. శృతిహర్షిత టెన్త్ వరకు కరీంనగర్‌లో, హైదరాబాద్‌లో ఇంటర్, అలహాబాద్ ఎన్‌ఐటీలో బీటెక్ కంప్లీట్ చేసింది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న శృతి హర్షిత గ్రూప్ 1 ఫలితాల్లో సత్తాచాటింది. ఆమె తండ్రి బాలయ్య కరీంనగర్ డీఎంహెచ్‌వో ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా, తల్లి కొత్తపల్లి పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
గ్రూప్ 2లో కొరటపల్లి యువతి సత్తా
రామడుగు, వెలుగు: రామడుగు మండలం కొరటపల్లికి చెందిన బందారపు ఆమని ఎంపీవోగా సెలెక్టయింది. ఆమని కేయూలో ఎంకామ్ పూర్తిచేసి పోటీపరీక్షలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలయిన గ్రూప్ 2 ఫలితాల్లో గ్రూప్-2లో 765 ర్యాంక్ సాధించింది. ఆమని తల్లిదండ్రులు బందారపు భవ్య-–తిరుపతిగౌడ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఆమని ఎంపికపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.