
బాలీవుడ్ దివగంత హీరో సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. సుశాంత్ మరణించి మూడు నెలలు అవుతున్నా..మరణంపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంపై అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుశాంత్ లాయర్ వికాస్ సింగ్ మాట్లాడుతూ సుశాంత్ ది హత్యేనని నమ్మేలా కొన్ని ఫోటోలు ఎయిమ్స్ డాక్టర్ కు పంపానని కానీ ఇంతవరకూ కేసు గురించి సీబీఐ, పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేకపోవడం తమకు విసుగు కలిగిస్తుందన్నారు.
తాము ఎయిమ్స్ డాక్టర్లకు ఇచ్చిన ఫోటోల ఆధారంగా సుశాంత్ ను ఎవరో గొంతు నుమిలి చంపేశారని, కానీ సీబీఐ ఆ కేసును మర్డర్ కేసుగా నమోదు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్పందించారు. ఇన్నీరోజులు చాలా ఓపికతో ఉన్నాం. నిజాన్ని వెలుగులోకి ఎంత సమయం పడుతుందోనంటూ ట్వీట్ చేశారు.