సుశాంత్ సూసైడ్ కు రియా చక్రవర్తే కారణం

సుశాంత్ సూసైడ్ కు రియా చక్రవర్తే కారణం


దివంగత బాలీవుడ్ యాక్టర ్సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు.  సుశాంత్ సింగ్  గర్ల్ ఫ్రెండ్ అయిన రియాపై పాట్నాలోని  రాజేంద్ర నగర్ లో  పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. సుశాంత్ ను రియా సూసైడ్ కు ప్రేరేపించిందని, ఆర్థికంగా మోసం చేసిందని మానసికంగా వేధించిందని ఆరోపించారు. దీంతో పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  నలుగురు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ కేసుపై విచారణ జరిపేందకు పాట్నా నుంచి ముంబైకి పంపారు. జూప్ లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాక  ఆయన కుటుంబం పబ్లిక్ లోకి వచ్చి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి. మరో వైపు రియాచక్రవర్తి కూడా సుశాంొత్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.