అమరత్వానికి అమృతం: చైనాలో వెలికితీశారు

అమరత్వానికి అమృతం: చైనాలో వెలికితీశారు

అమరత్వం కోసం దేవతలు అమృతం తాగేవారని పురాణాలు చెబుతాయి. అలాంటి అమృతాన్నే ఆర్కియాలజిస్టులు చైనాలో వెలికితీశారు. 2 వేల ఏళ్లనాటి ఓ సమాధిలోని ఓ కంచు కుండలో ఉన్న 3.5 లీటర్ల ‘అమృతాన్ని’ గుర్తించారు. ఆ కాలంలో బాగా డబ్బున్నోళ్లు అమరత్వం కోసం ఈ ద్రావణాన్ని తయారు చేసి ఉంటారని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఈ అమృతాన్ని పొటాషియం నైట్రేట్ , అల్యునైట్ అనే రసాయనాలతో తయారు చేసినట్టు గుర్తించారు. లువోయాంగ్ లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చరల్ రెలిక్స్ అండ్ ఆర్కియాలజీ పరిశోధకులు దీనిని వెలికితీశారు. ముందు అది ఓ మద్యం అని సైంటిస్టులు భావించారు. అమృతంతో పాటు మట్టి కుండలు, జాడీలు, కంచు పాత్రలను వెలికితీశారు.