- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
దహెగాం, వెలుగు: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా దహెగాం మండలంలో జరిగింది. స్థానికులు, ఎస్ఐ విక్రమ్ తెలిపిన ప్రకారం.. రాళ్లగూడకు చెందిన ఆత్మకూరి కళావతి(40), సంతోష్ దంపతులకు కొడుకు అంజన్న, కూతురు ఉన్నారు. ఇటీవల భర్త ఉపాధి కోసం హైదరాబాద్వెళ్లాడు.
పిల్లలిద్దరూ ఇట్యాల జడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. బుధవారం స్కూల్లో పేరెంట్స్మీటింగ్ఉండడంతో కళావతి వెళ్లింది. మధ్యాహ్నం నడుచుకుంటూ రాళ్లగూడకు బయలుదేరింది. సాయంత్రం స్కూల్నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి కనిపించలేదు. ఇంటికి రాలేదని తెలుసుకుని 100 కు కాల్ చేశారు.
దీంతో బ్లూకోల్ట్టీం వెళ్లి సాయంత్రం వరకు వెతికారు.సెల్ ఫోన్సిగ్నల్ట్రేస్చేయగా, అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు పక్కన పంట చేనులో ఆమె శవమై కనిపించిం ది. కళావతి మెడ కు చీరతో ఉరేసి చంపినట్టు కుటుంబసభ్యులు అనుమానించారు.
రాళ్లగూడకు చెందిన ఓ వ్యక్తి తన కోడలిని హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తూ మృతురాలి అత్త జయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ నితికా పంత్, కాగజ్నగర్డీఎస్పీ వహీదుద్దీన్, కాగజ్నగర్రూరల్ సీఐ కుమారస్వామి పరిశీలించారు. న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆందోళన చేసింది.
