
నెల్లూరు జిల్లా: ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం తీరు వ్యతిరేకంగా ఉందంటూ పలువురు సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ప్రస్తుతం ఆనందయ్య నెల్లూరు అధికారుల సంరక్షణలో ఉన్నారు. శనివారం ఆయుష్ కమిషనర్ రాములు సమక్షంలో ఆనందయ్య మందు తయారు చేయగా..ఔషధం హానికరం కాదన్నారు ఆయూష్ కమిషనర్. అయితే..ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్నారు రాములు. ఆదివారం సాయంత్రం ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం వెళ్తుంది. సోమవారం ఐసీఎంఆర్ బృందం సమక్షంలో ఆనందయ్య మరోసారి మందు తయారు చేయనున్నారు.