నల్లగొండలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

నల్లగొండలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. మంగళవారం( అక్టోబర్7) నల్లగొండ పట్టణంలోని డైట్​ కాలేజీ సమీపంలో ఓ రూంలో ఇంటర్​చదువుతున్న మైనర్​ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాలిక మృతిపట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న నల్లగొండ టూటౌన్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక డెడ్​ బాడీని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.