జూన్ క్వార్టర్‌‌‌‌లో .. సైయంట్​ లాభం అప్‌‌

జూన్ క్వార్టర్‌‌‌‌లో ..   సైయంట్​ లాభం అప్‌‌

హైదరాబాద్​, వెలుగు: కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో సైయంట్​నికర లాభం 45 శాతం పెరిగి రూ.116 కోట్ల నుంచి రూ. 168 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్​గా చూసినా కంపెనీ నికర లాభం పెరిగింది. ఆపరేషన్స్​ రెవెన్యూ 34.91 శాతం పెరిగి రూ. 1,686.50 కోట్లయిందని కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది క్యూ 1 లో ఈ రెవెన్యూ రూ. 1,250 కోట్లు. డిజిటల్​, ఇంజినీరింగ్​, టెక్నాలజీ రెవెన్యూ గ్రోత్​ ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో 15–20 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు సైయంట్​ తెలిపింది. 

ALSO READ :ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కట్టొచ్చు

ఇబిటా మార్జిన్స్​లో ​ 150–250 బేసిస్​ పాయింట్ల మెరుగుదలను ఆశిస్తున్నట్లు పేర్కొంది. క్యూ 1 రిజల్ట్స్​ సానుకూలంగా వచ్చాయని మేనేజింగ్​ డైరెక్టర్​ కృష్ణ బోదనపు చెప్పారు. డిజిటల్​, ఇంజినీరింగ్​, టెక్నాలజీ బిజినెస్​లో ఆరు లార్జ్​ డీల్స్​ను తాజా క్వార్టర్లో దక్కించుకోగలిగామని వెల్లడించారు. వీటి విలువ 48.8 మిలియన్​ డాలర్లని చెప్పారు. సైయంట్​ షేర్లు 1.16 శాతం తగ్గి రూ. 1,466  వద్ద క్లోజయ్యాయి.