5 జీ టెక్నాలజీతో ఎదగాలి : ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్

5 జీ టెక్నాలజీతో ఎదగాలి : ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్
  • ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్  
  • శంషాబాద్ లోని వర్ధమాన్ కాలేజీలో సదస్సు 

శంషాబాద్, వెలుగు :  5జీ   టెక్నాలజీపై  అవగాహన  పెంచుకుంటూ జీవితంలో  ఉన్నతస్థాయికి ఎదగాలని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్  సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 5 జీ సేవలు అందుబాటులోకి రావడంతో మంచి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కాచారం వద్ద  వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో  ఐ త్రిబుల్ ఈ కమ్యూనికేషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం  నిర్వహించిన 5జి అవగాహన సదస్సు ప్రారంభోత్సవానికి స్వదేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

5జీ టెక్నాలజీ రంగంలో విద్యార్థులు రాణించాలని సూచించారు. 5జీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని , విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ జేవీఆర్​ రవీంద్ర సూచించారు. ఈ సదస్సులో  హైదరాబాద్ ఐ త్రిబుల్ ఈ శాఖ ప్రొఫెసర్లు జబ్బార్, జయప్రకాశ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.