ఇది స్వచ్ఛమైన బజార్‌ : మార్కెట్‌ లో మంచి గిరాకీ

ఇది స్వచ్ఛమైన బజార్‌ : మార్కెట్‌ లో మంచి గిరాకీ

హైదరాబాద్ : ఆ దుకాణం పేరు ‘స్వచ్ఛ, ది ఆర్గానిక్‌ బజార్‌ ’. వారంలో ఒక్కరోజు మాత్రమే దానిని తెరుస్తా రు. పైగా ఆ దుకాణానికి బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. బజార్‌ లో అమ్మకాల దగ్గరి నుంచి బిల్లు వేయడం దాకా అంతా చిన్న పిల్లలే చూసుకుంటారు. వీళ్లంతా ‘స్పెసిఫిక్‌ లెర్నిం గ్‌ డిసేబిలిటీ’తో బాధపడుతున్న వాళ్లు కావడం ఇక్కడి విశేషం. స్వచ్ఛ ఆర్గానిక్‌ బజార్‌ ఆలోచన వెనుక ఉన్నది సాహితీరెడ్డి, సుపర్ణ బజాబ్‌ లు. హైదరాబాద్‌ కి చెందిన ఈ ఇద్దరూ 2017 నుంచి ఈ దుకాణం నిర్వహిస్తున్నారు . అయితే ఇక్కడ అడుగుపెట్టగానే రంగురంగుల బుట్టల్లో కూరగాయల్ని పేరుస్తూ పిల్లలు కనిపిస్తారు. సర్దడం దగ్గరి నుంచి, తూకం వేయడం, ప్యాకింగ్‌ , బిల్లింగ్‌ .. అన్ని పనుల్ని పిల్లలే చేస్తుంటారు. వీళ్లం తా ‘క్షేత్రం’ స్కూల్‌ విద్యార్థులు.. లెర్నింగ్‌ డిసేబిలిటీతో బాధపడుతున్నవాళ్లే. ప్రతీ గురువారం మధ్యాహ్నం క్షేత్రం ఆవరణలోనే స్వచ్ఛ బజార్‌ ను నిర్వహిస్తారు . పిల్లలకు ఫన్‌ యాక్టి విటీగానే కాదు.. వ్యక్తిగతంగా వాళ్ల మానసిక స్థితి పరివర్తనకు ఈ ఆలోచన ఎంతో తోడ్పడుతోంది.

మెంటల్‌ ఎక్సర్‌ సైజ్‌

సాహితి, సుపర్ణలు పన్నెండేళ్ల నుంచి ‘క్షేత్రం’ హోం స్కూలింగ్‌ సెంటర్‌ ను నిర్వహిస్తున్నారు. అయితే ఆర్గానిక్‌‌‌‌ బజార్‌ ఆలోచన మాత్రం సాహితీది. పిల్లలకు ఎంట్రప్రెన్యూరియల్‌ స్కిల్స్‌‌‌‌ నేరాల్పన్న ఉద్దేశాన్ని సుపర్ణకు వివరించింది. అప్పటికే సుపర్ణ నగర శివారులో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. ‘క్షేత్రంలో ఆర్గానిక్‌‌‌‌ వెజిటబుల్‌ మార్కెట్‌ ఏర్పాటు చేద్దామని సాహితి నాతో చెప్పింది’. పిల్లలు స్టాల్స్‌‌‌‌ వద్ద సంతోషంగా గడపటం మంచి ఆలోచన. వాళ్లకు మెంటల్‌ ఎక్సర్‌ సైజ్‌ . అంతేకాదు ఇతరులతో ఇంటరాక్ట్‌‌‌‌ కావడం వల్ల వాళ్లకు బోలెడు విషయాలు తెలిసే అవకాశం ఉంది’ అని వివరించింది సుపర్ణ. మానసిక ఆరోగ్యం సరిగ్గా బాగోలేని వాళ్ల కోసం చెన్నైలో ‘ఆత్మనిర్భర్‌ ’ స్టేషనరీ స్టోర్స్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. అకౌంటింగ్‌ , డేటా ఎంట్రీ, అమ్మకాలు వాళ్లే చూసుకుంటారు. ఆ స్ఫూర్తితోనే సాహితి, సువర్ణలు ‘స్వచ్ఛ, ది ఆర్గానిక్‌‌‌‌ బజార్‌ ’ను ఏర్పాటు చేశారు.

స్కూల్‌ బెల్‌ కొట్టాక…

క్షేత్రంలో మొత్తం పాతిక మందికి పైగా విద్యార్థులు. పన్నెండు మంది స్టాఫ్‌ ఉంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్కూల్‌ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలు కోకరిక్యులర్‌ యాక్టి విటీస్‌ లో పాల్గొంటారు. ఇందులో భాగంగా ప్రతీ గురువారం మధ్యాహ్నం రెం డు నుంచి మూడు గంటల మధ్య ఆర్గానిక్‌‌‌‌ బజార్‌ ను నిర్వహిస్తారు. ప్రతి శనివారం బోడుప్పల్‌ లో ఉన్న సేంద్రీయ సాగు ప్రాంతానికి పిల్లల్ని తీసుకెళ్తారు. అక్కడ పిల్లలు సరదాగా గడపడమే కాకుండా.. రైతుల నుంచి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. మిగతా రోజుల్లో పోయెట్రీ, కార్పెంట్రీలో శిక్షణ తీసుకుంటారు. వారంలో ఒక రోజు ప్రొఫెషనల్ చెఫ్‌ సాయంతో బేకింగ్‌ ఐటమ్స్‌‌‌‌ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పిల్లలు బేక్‌‌‌‌ చేసిన ఐటమ్స్‌‌‌‌కు మార్కెట్‌ లో మంచి గిరాకీ ఉండటం.

ఆర్గానిక్‌ ఉత్పత్తులు..

కూరగాయలతో పాటు బియ్యం, ఆయిల్‌ , పచ్చళ్లు, మురుకులు, సబ్బులు, మిల్లెట్లు , తాటాకులతో నేసిన బుట్టలు, ఇతర రాష్ట్రా ల నుంచి దిగుమతి అయిన ఆర్గానిక్‌‌‌‌ ఉత్పత్తులు ఈ దుకాణంలో అమ్ముతారు. ప్రతి సోమవారం వాట్సాప్‌ లో కస్టమర్లు ఆర్డర్లు పెడతారు. వాటిని పిల్లలు సపరేట్‌ షీట్ల మీద నోట్‌ చేస్తారు. ఆ లిస్ట్‌‌‌‌ను నేరుగా రైతులకు పంపిస్తారు. బుధవారం లోపు రైతులు, వ్యాపారులు ఆ ఆర్డర్లను అందజేస్తారు. గురువారం నిర్వహించే ఆర్గానిక్‌‌‌‌ బజార్‌ లో పిల్లలు వాటిని అమ్ముతారు. సిబ్బంది సాయంతో పిల్లలు ‘బిజినెస్‌ టెక్నిక్స్‌‌‌‌’ నేర్చుకుంటారు. శివ్‌ , శైలజా అసర్‌ లు కో–ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. బిల్లింగ్‌ సమయంలో ఒక్కోసారి సుపర్ణ దగ్గరుండి పిల్లలకు సహకరిస్తుంది. ఈ దుకాణంతో పాటు హోం డెలివరీ కోసం ప్రత్యేకంగా కొందరు బాయ్స్‌‌‌‌ని నియమించుకున్నారు.

వీల్‌ మార్కెట్‌

స్వచ్ఛ దుకాణంలో స్టాకింంగ్‌ నుంచి వేయింగ్, బిల్లింగ్‌ అంతా పిల్లలే చేస్తారు. అయితే ఈ మధ్యే వీల్‌ మార్కెట్‌ రంగంలోకి కూడా వాళ్లు అడుగుపెట్టారు. మినీ–ట్రక్కులో వ్యాపారులు, రైతులు అమ్మే వస్తువులతో పాటు కేక్స్‌‌‌‌, రోల్స్‌‌‌‌, బ్రెడ్స్‌‌‌‌, పిల్లలు తయారు చేసిన మినీ బగ్గెట్స్‌‌‌‌ అమ్ముతారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ట్రక్కు అమ్మకాలు కొనసాగిస్తోంది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సమ్మర్‌ హాలీడేస్‌ ముగిశాక తిరిగి ప్రారంభిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ గనుక విజయవంతం అయితే కో–కరిక్యులమ్‌ ప్రోగ్రామ్స్‌‌‌‌ ‘మార్కె ట్‌ ఆన్‌ వీల్స్‌‌‌‌’ను కూడా చేరుస్తామంటున్నారు నిర్వాహకులు. ‘‘పిల్లలకు బిజినెస్‌ లో ఫస్ట్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్‌‌‌‌ బజార్‌ ను నెలకొల్పాం . ఈ దుకాణం నడిపేటప్పుడు పిల్లల్లో ఆనందం, వ్యాపారం చేస్తున్నామనే గర్వం కనిపిస్తుంది. ఇతరులను కలుసుకునేందుకు.. బోలెడు విషయాల్ని నేర్చుకునేందుకు వాళ్లకు ఇదొక మంచి మార్గం ’’ అంటు న్నారు సాహితి, సుపర్ణలు.