వికారాబాద్, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్స్పీడ్వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని అదనపు డీజీపీ స్వాతి లక్రా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్‌లోని శ్రీసాయి డెంటల్ కాలేజీలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లు, విద్యార్థులు, ఆశా వర్కర్లకు డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ పై గ్రామాల్లో అవగాహన పెంచాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఉత్తమ సేవలు అందించిన 108 సిబ్బంది, డాక్టర్లను కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి సన్మానించారు.

