స్విగ్గీ చేతికి ఉబర్‌ ఈట్స్..?

స్విగ్గీ చేతికి ఉబర్‌ ఈట్స్..?

ఫుడ్ ఆర్డర్ డెలివరీ బిజినెస్ లో స్విగ్గీ మరియు జొమాటోల మధ్య పోటీ మరింత తీవ్రతరమవుతోంది. ఉబర్ఈట్స్‌ ను దక్కించుకునేందుకు ఈ రెండు సంస్థలు తెగ పోటీ పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఉబర్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ బిజినెస్‌ ను కొనేందుకు స్విగ్గీ చర్చలు జరుపుతోందని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. ఉబర్‌‌‌‌కు స్విగ్గీకి మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు వచ్చాయని రిపోర్టు తెలిపింది. ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్ అయితే ఫుడ్ టెక్ మార్కెట్‌‌లో ఇదే అతిపెద్ద కన్సాలిడేషన్. షేర్ల రూపంలో ఈ డీల్ ఉండనుంది. కొనుగోలు చేసే కంపెనీ ఉబర్‌‌‌‌కు వాటాలను కేటాయించనుంది.

స్విగ్గీతో డీల్ సక్సెస్ అయితే ఆ కంపెనీలో 10 శాతం వాటాలను ఉబర్‌‌‌‌ దక్కించుకోనుంది. ఇటీవల స్విగ్గీ వాల్యుయేషన్ 3.30 బిలియన్ డాలర్లుగా లెక్కించారు.గతేడాది డిసెంబర్‌‌‌‌లో ఇది 100 కోట్ల డాలర్ల నిధులను సేకరించింది. స్విగ్గీతో పాటు జొమాటో కూడా ఉబర్‌‌‌‌ఈట్స్‌ ను దక్కించుకునే రేసులో ఉందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఉబర్ఈట్స్ రోజుకు లక్షా 50వేల నుంచి 2 లక్షల 50వేల వరకు ఆర్డర్లను సర్వీస్ చేస్తోంది. తన ప్రత్యర్థి ఓలా రన్ చేసే ఫుడ్‌‌పాండా కంటే ఉబర్ఈట్స్ వ్యాపారాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ రైడ్‌‌ షేరింగ్‌ లో మాత్రం ఉబర్‌‌‌‌కు ఓలా గట్టి పోటీనిస్తోంది. ఉబర్ ఈట్స్ అమ్మకం ద్వారా వచ్చే నిధులతో ఇండియాలో తనకున్న నష్టాల నుంచి ఉబర్‌‌ బయటపడాలనుకుంటోంది. అంతేకాక ఉబర్‌‌‌‌ పబ్లిక్ ఆఫరింగ్‌ కు కూడా వెళ్తోంది.