న్యూ ఇయర్ సందర్భంగా 3.5లక్షల బిర్యానీలు డెలివరీ చేసిన స్విగ్గీ

న్యూ ఇయర్ సందర్భంగా 3.5లక్షల బిర్యానీలు డెలివరీ చేసిన స్విగ్గీ

ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. రాత్రి 10.25 గంటల సమయానికి ఈ యాప్ దేశవ్యాప్తంగా 61,000 పిజ్జాలను కస్టమర్లకు పంపిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ట్విట్టర్ లో నిర్వహించిన ఓ పోల్ ప్రకారం.. హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని, లక్నోలో  14.2 శాతం, కోల్‌కతాలో10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. కాగా ఒక్క రోజులోనే 3.5 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసిన ఫుడ్ డెలివరీ యాప్ గా స్విగ్గీ అగ్రస్థానంలో నిలిచింది. 

హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ అమ్ముడవుతున్న రెస్టారెంట్‌లలో ఒకటైన బావర్చి, 2021 కొత్త సంవత్సరం సందర్భంగా నిమిషానికి రెండు బిర్యానీలను డెలివరీ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31, 2022 నాటికి 15 టన్నుల రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. ఇక డామినోస్ 61,287 పిజ్జాలను డెలివరీ చేసినట్టు తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే ఎన్ని ఒరేగానో ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయో ఊహించవచ్చని స్విగ్గీ ట్వీట్ చేసింది.  ఇక శనివారం రాత్రి 7 గంటల నాటికి స్విగ్గీ .. ఇన్‌స్టామార్ట్‌లో 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కూడా తెలిపింది. ఇదిలా ఉండగా దేశం మొత్తం మీద దాదాపు 12,344 మంది కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి 9.18 గంటల వరకు కిచిడీని ఆర్డర్ చేసినట్టు సమాచారం.