ఓన్లీ స్విగ్గీలోనే.. : రోజూ 21 వేల బిర్యానీ ఆర్డర్స్.. తినరా మైమరిచి...

ఓన్లీ స్విగ్గీలోనే.. : రోజూ 21 వేల బిర్యానీ ఆర్డర్స్.. తినరా మైమరిచి...

భారతదేశంలో బిర్యానీ ఫేమస్ అన్న మాట మరోసారి నిరూపితమైంది. స్విగ్గీ 2023 ట్రెండ్స్ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, హైదరాబాద్, వరుసగా ఎనిమిదో సంవత్సరం బిర్యానీ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఈ డిష్ 40లక్షల 30వేల 827 సార్లు సెర్చ్ చేయబడింది. 2023లో స్విగ్గీ డెలివరీ చేసే ప్రతి ఆరో బిర్యానీని హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసినట్లు తెలిపింది. భారతదేశంలో సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ అవుతుండగా.. నగరంలో ప్రతి నిమిషానికి సుమారుగా 15 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నట్టు సమాచారం. ఇది గంటకు దాదాపు 900 బిర్యానీలు.. అంటే రోజుకు 21,600 బిర్యానీలన్నమాట.

ఒకే కస్టమర్ అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం బిర్యానీ వంటకాన్ని ఆస్వాదించవచ్చు. మధ్యలో కొన్ని అదనపు భోజనాలు కూడా ఉండవచ్చు. అలా ఆ వ్యక్తి రోజుకు సగటున నాలుగు బిర్యానీల కంటే ఎక్కువగా మొత్తం 1,633 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. మరో హైదరాబాద్ కస్టమర్.. 2023లో కేవలం ఇడ్లీల కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశారని స్విగ్గీ తెలిపింది.

ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. హైదరాబాద్‌కు చెందిన మరొక స్విగ్గీ యూజర్ 2022లో 8వేల 428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అతను ఆర్డర్ ఇచ్చాడు.