ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండమ్మా

ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండమ్మా

డిసెంబర్ 26 భారత్ ‌‌‌‌– ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​ లో భారత క్రికెటర్లు రాణించాలంటే వాళ్లు తప్పని సరిగా ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేసి గేమ్ పై కాన్సట్రేషన్ చేయాలని సూచించారు ఇండియన్ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

డిసెంబర్ 19,2020. ఇండియా టెస్ట్ హిస్టరీలో ఈ రోజు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అడిలైడ్ డేనైట్ టెస్టులో కోహ్లీసేన చెత్త ఆటకు సాక్ష్యమైన 36పరుగల ఇన్నింగ్స్ అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అత్యంత దారుణమైన పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా తొలి టెస్ట్ లో 8వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ఓవరనైట్ స్కోర్ 9/1 తో శనివారం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీసే.. కంగారూ పేస్ ద్వయం షేజిల్ వుడ్, కమిన్స్ బౌలింగ్ దెబ్బకు 36రన్స్ కే కుప్పకూలి టెస్టుల్లో తన లోయెస్ట్ స్కోరు చేసింది. ఫలితంగా 1974లో లార్డ్స్ వేదికాగా ఇంగ్లండ్ పై టీమిండియా చేసిన 42రన్స్  స్కోరును బీట్ చేసింది.

అయితే, ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెటర్ల ఆట తీరుపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇండియన్ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ జరగాల్సిందేదో జరిగింది. మీ ఫోన్లు స్వచ్ఛ్ ఆఫ్ చేసి, నెక్ట్స్ టెస్ట్ మ్యాచ్ లో ఎలా రాణించాన్న అంశంపై కాన్సట్రేషన్ చేయండని అన్నారు. వైస్ కెప్టెన్ గా అజ్యంకా రహనే టీమ్ మొత్తాన్ని ఒకే తాటిపై తెచ్చి 2టెస్ట్ మ్యాచ్ లో రాణించాలని మహ్మద్ కైఫ్ సూచించారు.