సిస్టమ్‌‌కు ఎదురెళితే.. మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంట్రస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా

సిస్టమ్‌‌కు ఎదురెళితే.. మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంట్రస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా

సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘సిస్టమ్’. అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. మే 22 నుంచి ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. అధికారం, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. నేహా అనే యువ లాయర్‌‌‌‌గా  సోనాక్షి కనిపించింది. తన తండ్రి లా ఫర్మ్‌‌లో పార్టనర్ అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తుంటుంది.  అందుకోసం ఒక్క కేసు కూడా ఓడిపోకుండా వరుసగా పది కేసులు గెలిచి రమ్మంటాడు తండ్రి. ఇందుకు కోర్ట్ స్టెనోగ్రాఫర్ సారిక (జ్యోతిక) హెల్ప్ తీసుకుంటుంది నేహా.

డబ్బు కోసమే సారిక ఇందుకు ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. కానీ తన ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఈ క్రమంలో కోర్టు కేసుల్లో నేహాకు ఎన్నో చిక్కుముడులు ఎదురవుతాయి. ఓ కేసులో తన తండ్రినే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. జ్యోతిక సీక్రెట్ అజెండా ఏమిటి.. నేహా కేసు గెలిచిందా అనేది మిగతా కథ. ధనవంతుల అరుపుల మధ్య పేదవాడి గొంతు మూగబోతుంది.. ధనవంతులైనా, పేదవాళ్లైనా న్యాయం మీద అందరికీ హక్కు ఉంటుంది... న్యాయం అనేది ఒకటుంటుంది కదా అది భగవంతుడు లాంటిది, అతికష్టంపై  దొరికేది లాంటి డైలాగ్స్‌‌ స్టోరీలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి.