స్టార్టప్‌‌ల కోసం టీ-హబ్ ల్యాబ్ 32 ప్రొగ్రామ్

స్టార్టప్‌‌ల కోసం టీ-హబ్ ల్యాబ్ 32 ప్రొగ్రామ్

హైదరాబాద్, వెలుగు : టీ–హబ్ రీడిజైన్ చేసిన తన ఫ్లాగ్‌‌షిప్ ప్రొగ్రామ్ ల్యాబ్ 32ను లాంఛ్ చేసింది. నాలుగో బ్యాచ్ స్టార్టప్ అప్లికెంట్లకు సరికొత్త ప్రయోజనాలతో ఈ ప్రొగ్రామ్‌‌ను తీసుకొచ్చింది. కరోనా మహమ్మారితో ల్యాబ్32 ప్రొగ్రామ్‌‌ను టీ–హబ్ రీడిజైన్ చేసింది.ఎర్లీ, ర్లీమిడ్ లెవెల్ టెక్నాలజీ స్టార్ట‌ప్‌ లు తమ ప్రొడక్లట్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసుకునేందుకు, మరిన్ని మార్కెట్లకు విస్తరించేందుకు ఈప్రొగ్రామ్ సాయం చేయనుంది. అంతకుముందు ల్యాబ్‌ 32 ప్రొగ్రామ్ కింద షార్ట్ లిస్ట్‌ అయిన స్టార్ట‌ప్ లు తప్పనిసరిగా హైదరాబాద్‌‌కు రావాల్సి ఉండేది. కానీ ఈఏడాది హైబ్రిడ్ ప్రొగ్రామ్ కింద షార్ట్ లిస్ట్‌ అయిన స్టార్ట‌ప్‌ లు హైదరాబాద్‌‌కి రాకపోయినా.. అన్ని రకాల ప్రయోజనాలు పొందుతాయి.

ల్యాబ్‌‌32 మాడ్యూల్స్ ప్రొడక్లట్‌ లేటెస్ట్ వెర్ష‌న్ల‌ను అభివృద్ధి చేయడానికి సాయం చేయడంతో పాటు, మార్కెట్ అవకాశాలను అందించనున్నాయి. నాలుగో బ్యాచ్ ల్యాబ్32 ప్రొగ్రామ్ లో నాలుగు నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ 2020 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్లను మంగళవారం నుంచి తీసుకుంటున్నారు. 2020 ఆగస్ట్ 25తో అప్లికేషన్ల గడువు ముగుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..