టీహబ్​తో ఐఎఫ్​సీసీఐ అవగాహనా ఒప్పందం

టీహబ్​తో ఐఎఫ్​సీసీఐ అవగాహనా ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: ఇండో–-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఐఎఫ్​సీసీఐ)తో టీ–హబ్​ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై శుక్రవారం సంతకం చేసింది.  ఒక సంవత్సరంపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. భారతదేశం,  ఫ్రాన్స్ ఆధారిత టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు కల్పించడం, రెండు దేశాలలో ఇనోవేషన్​ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. టీహబ్,​ ఐఎఫ్​సీసీఐ ఫ్రెంచ్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్​ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి టెక్నాలజీ, ఇనోవేషన్​ రంగాలలో ఇండో–-ఫ్రెంచ్ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈవెంట్‌‌‌‌‌‌‌‌లను, వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ  ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్ రంజన్, ఐఎఫ్​సీసీఐ ఫౌండర్ సుమీత్ ఆనంద్, భారతదేశానికి ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, భారతదేశంతో ఆర్థిక సంబంధాల కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి  పాల్ హెర్మెలిన్ పాల్గొన్నారు.