తబ్ భీ B.. అబ్ భీ B : వాట్ ఎ క్రియేటివిటీ

తబ్ భీ B.. అబ్ భీ B : వాట్ ఎ క్రియేటివిటీ

అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు పూర్తయింది. ఫిబ్రవరి 15న ఈ మైలురాయి దాటినట్టు అభిషేక్ బచ్చన్ ఇప్పటికే చెప్పేశాడు. 1969లో తొలి సినిమా సాథి హిందుస్థానీ చేసిన అమితాబ్… ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా, బాద్ షాగా కొనసాగుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ అమూల్ డెయిరీ రూపొందించిన ఓ కార్టూన్ ను ఇపుడు వైరల్ గా మారి.. జనం ప్రశంసలు అందుకుంటోంది.

Amitab పేరులోని చివరి 3 అక్షరాలను ఉపయోగించి రాసిన ఓ పదప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. యంగ్ డేస్ లో ఉన్న అమితాబ్ ను… థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలో కనిపించిన అమితాబ్ ఫొటోలను చూపిస్తూ.. “తబ్ భీ B… అబ్ భీ B”అని ఓ డూడుల్ ను క్రియేట్ చేసింది. అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ బాద్ షా అనీ.. యాక్టింగ్ గాడ్ అనీ.. హంబుల్ మ్యాన్ అనీ… మూవీ మెగాస్టార్ అనీ రకరకాలుగా ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు.

కౌన్ బనేగా కరోడ్ పతితో ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్స్ ను పెంచుకున్న అమితాబ్.. త్వరలో బద్లా, బ్రహ్మాస్త్ర, సైరా సినిమాలతో వెండితెరపై పలకరించనున్నారు.