ఏపీలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ... ఎప్పుడంటే...

 ఏపీలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ... ఎప్పుడంటే...

ఆంధ్రప్రదేశ్​లో 8వతరగతి చదివే విద్యార్థులకు ఈ నెల 21న సీఎం జగన్​ పుట్టిన రోజు సందర్భంగా ట్యాబులను పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు.  45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏపీ ప్రభుత్వం ఆర్ధికం సాయం చేస్తుందన్నారు.  జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఏపీ మంత్రి వర్గం ఆమోదించింది. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు.

మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు.. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు జరుగుతుందన్నారు.

 ఆరోగ్య శ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టామని.. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.  ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.