
- మోటార్ బాగు చేయాలని ఆదివాసీల విన్నపం
జైనూర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని తాడిగూడ గ్రామంలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామంలో ఉన్న ఏకైక బోర్ అడగంటి పోవడంతో సమస్య తీవ్రమైంది. బావి నుంచి సప్లై చేసే కరెంటు మోటార్ రెండ్రోజుల క్రితం కాలిపోవడంతో ట్యాంక్‌కి నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దాహం తీర్చుకోడానికి కిలోమీటర్ల దూరం లో ఉన్న వాగు నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే మోటార్ మరమ్మతు చేసి నీటి సమస్యను పరిష్కరించాలంటూ తాడిగూడ వాసులు కోరుతున్నారు.