ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ గా ఠాగూర్ బాలాజీ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం జడ్పీ ఆఫీస్ లో అడిషనల్​కలెక్టర్ మనూచౌదరి బాలాజీ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. జడ్పీ మాజీ చైర్​పర్సన్​పద్మావతికి ముగ్గురు పిల్లలున్నారని, హైకోర్టు తెలకపల్లి జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. దీంతో కలెక్టర్ ఉదయ్ కుమార్ వైస్​చైర్మన్​ఠాగూర్ బాలాజీ సింగ్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా  జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ  జిల్లాలో  విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు.  ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​, జడ్పీ సీఈవో ఉష తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి:మంత్రి  నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి సి. నిరంజన్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ‘డబుల్’ ఇండ్లు, రోడ్ల విస్తరణ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అమరవీరుల స్థూపం ఏర్పాటు తదితర అంశాలపై ఆయన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ కమ్యూనిటీ భవనం, సబ్ స్టేషన్, డీఎస్పీ ఆఫీస్,  ట్రాఫిక్ పోలీస్, ఎస్పీ ఆఫీస్ వరకు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ ఏర్పాటు చేయాలని, పట్టణంలో రోడ్ల విస్తరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్పీ అపూర్వ రావు, అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీయే: బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు 

నారాయణపేట, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ‘పేట’ జిల్లా అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని  సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. నగర అధ్యక్షుడు రఘు రామయ్యగౌడ్ అధ్యక్షతన  జరిగిన సమావేశానికి హాజరైన శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్​అవినీతి కుటుంబ పాలన సాగుతోందన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం, మునుగోడులో హోరాహోరీ ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మీటింగ్​లో సీనియర్​అడ్వకేట్​రఘువీర్ యాదవ్ , నియోజకవర్గ కన్వీనర్​ జీకే నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, పట్టణ ఇన్​చార్జి ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. 


టాలెంట్​ను గుర్తించి ఎంకరేజ్​ చేయాలె:మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్

మహబూబ్​నగర్, వెలుగు: ప్రతి స్టూడెంట్​లో టాలెంట్​ ఉంటుందని, దాన్ని టీచర్లు గుర్తించి ఎంకరేజ్​చేయాలని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్​అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫాతిమా స్కూల్​లో సోమవారం జిల్లా స్థాయి సైన్స్​ఫెయిర్​ను మంత్రి ప్రారంభించారు. జిల్లాలోని240 ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్ల నుంచి 342 అంశాలపై స్టూడెంట్లు ఎగ్జిబిట్స్​ ప్రదర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి  వాటిని పరిశీలించి వాటి పనితీరును స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మార్కులు తప్ప పిల్లల ఆకాంక్షలను తల్లిదండ్రులు పట్టించుకుంటలేరన్నారు.  పిల్లలకు చదువే కాకుండా నైతిక విలువలు నేర్పించాలన్నారు.  సినిమాలు, సీరియల్స్, సెల్ ఫోన్ల వల్ల దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను స్టూడెంట్లు వినియోగించుకొని గొప్ప సైంటిస్టులుగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు.  ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​స్వర్ణ సుధాకర్​రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.  

 జీజీహెచ్​లో ఫ్రీగా టిఫ్ఫా స్కానింగ్​

గవర్నమెంట్​జనరల్​ఆస్పత్రి(జీజీహెచ్) లో టిఫ్ఫా స్కానింగ్​ను  అందుబాటులోకి తీసుకురావడం వల్ల పేదలకు భారం తగ్గిపోనుందని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. సోమవారం జీజీహెచ్​లో  రెండు మోడ్రన్ టిఫ్ఫా స్కానింగ్ మెషీన్​లను మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్ మెషీన్లు​అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను 
ఆదేశించారు.  

సీఎం టూర్​కు ఏర్పాట్లు పక్కాగా చేయాలి:కలెక్టర్​ ఎస్. వెంకట్​రావు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ ఎస్.వెంకట్ రావు  అధికారులను ఆదేశించారు. ‘ప్రజావాణి’లో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ మీటింగ్ హాల్​లో 
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్, శిల్పారామం ఆర్చి ప్రారంభం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన, అనంతరం బహిరంగసభకు హాజరవుతుండడంతో ఏర్పాట్లు  పక్కాగా చేయాలన్నారు.  అనంతరం కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.