తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి

V6 Velugu Posted on Apr 02, 2021

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. మరో 72 మంది గాయపడ్డారు. తైపీ నుంచి తైటంగ్‌కు టూరిస్ట్‌లను తీసుకెళ్తున్న రైలు తూర్పు తైవాన్‌లోని హువాలియన్‌ సమీపంలో పట్టాలు తప్పిందని తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 350 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ట్రైన్ అండర్ పాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరగడంతో చాలామంది బోగీల్లోనే చిక్కుకుపోయారు. అంతా చీకటిగా ఉండటంతో వారిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. ఘటనాస్థలివద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తైవాన్‌లో 2018లో కూడా ఒక రైలు ప్రమాదం జరిగింది. ఈశాన్య తైవాన్‌లో రైలు పట్టాలు తప్పడంతో 18 మంది మరణించగా.. 175 మంది గాయపడ్డారు. 

Tagged Train Accident, Taiwan, Train Crash

Latest Videos

Subscribe Now

More News