
తైవాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అసుస్ ఇండియా మార్కెట్లోకి కొత్తగా ఆరు నోట్‌బుక్ ల్యాప్‌టాప్ పీసీలను లాంచ్ చేసింది. కంటెంట్ క్రియేటర్లు, కస్టమర్ల కోసం అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కొత్త సిరీస్ ల్యాప్‌లలో జెన్‌బుక్ ప్రో 14 డుయో, జెన్‌బుక్ ప్రో 16ఎక్స్, ప్రో ఆర్ట్ vస్టూడియోబుక్ ప్రో 16, ప్రోఆర్ట్స్టూడియో బుక్ 16, వివోబుక్ ప్రో 15, వివోబుక్ ప్రో 16ఎక్స్ ఉన్నాయి. ధరలు రూ. 1,44,990 నుంచి మొదలవుతాయి. స్టూడియో బుక్ ల్యాప్‌టాప్‌ల ధరలు రూ.రెండు లక్షల నుంచి, వివోబుక్ ప్రో లైనప్ ధరలు రూ.67,990 నుంచి మొదలవుతాయి. వీటిని ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ అమ్ముతారు.