నిలిచిపోయిన తాలిబన్ల వెబ్ సైట్స్

V6 Velugu Posted on Aug 21, 2021

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లను నిర్మూలించలేక అమెరికా అప్పుకోనుంది. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా సేనల ప్రాబల్యం కొనసాగినంతకాలం తాలిబన్లు పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ వాయిస్ ను వినిపించేవారు. తీవ్ర భావజాల వ్యాప్తికి వెబ్, సోషల్ మీడియాను వారు వినియోగించుకునేవారు.

అయితే..ఆఫ్ఘన్ లో తాలిబన్ల దురాక్రమణ క్రమంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలను తాలిబన్ల ఖాతాలను నిషేధించాయి.  దీంతో నిన్నటి నుంచి తాలిబన్ వెబ్ సైట్లు కూడా మూగబోయాయి. తాలిబన్లు ప్రధానంగా ఐదు భాషల్లో వెబ్ సైట్ల ద్వారా తమ భావజాల వ్యాప్తి, ప్రకటనలు చేస్తుంటారు. పష్తో, ఉర్దు, అరబిక్, ఇంగ్లీషు, దరీ భాషల్లో తాలిబన్లు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్లు శుక్రవారం నుంచి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయాయి.

క్లౌడ్ ఫ్లేర్ సంస్థ ఈ వెబ్ సైట్ల హోస్టింగ్ కార్యకలాపాలు చేపడుతుండగా, మీడియా ప్రతినిధులు ఆ సంస్థను సంప్రదించగా, సరైన స్పందన రాలేదు. తాలిబన్ల వెబ్ సైట్ల కార్యకలాపాలు నిలిచిపోవడం మంచి పరిణామమేనని మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్లు తమ భావజాలంతో ప్రజలనే కాకుండా అల్ ఖైదా తో పాటు అతివాద ఇస్లామిక్ సంస్థలను కూడా ప్రేరేపించగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Tagged Taliban websites down, WhatsApp sites, cut off

Latest Videos

Subscribe Now

More News