తాలిపేరు ఎడమ కాల్వను బాగుచేయండి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

తాలిపేరు ఎడమ కాల్వను బాగుచేయండి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాచలం, వెలుగు: తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వను బాగు చేయాలని ఇరిగేషన్​ ఇంజనీర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ ఆదేశించారు. ఆయన శుక్రవారం దుమ్ముగూడెం మండలం వీరభద్రాపురంలో తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వను పరిశీలించారు. కాల్వలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని సూచించారు. కాల్వ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను ఈఈ జానీని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు 24,700 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, ఎడమ కాల్వ 46.46 కి.మీల పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఈఈ వివరించారు. 

కాల్వలో పెరిగిన గడ్డి, చెత్త, పూడికను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కల్గకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. తర్వాత దుమ్ముగూడెం పీహెచ్​సీని సందర్శించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రి నిర్వహణపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఫిజికల్ ఫిట్​నెస్​ సర్టిఫికేట్​ కోసం వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో మందులు రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. దుమ్ముగూడెం తహసీల్దార్​ అశోక్​కుమార్ తదితరులున్నారు.