
కేజిఎఫ్ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కన్నడ సినిమాగా రిలీజయ్యి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 3 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాప్టర్ 3 ఉంటుందని కేజిఎఫ్ 2లో హింట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఈ క్రమంలో ఆడియెన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించబోతున్నారట.
అజిత్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు చేయబోతున్నారని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఇందులో ఒక సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని టాక్. ఇంకో సినిమా కేజీఎఫ్ యూనివర్స్ కు సంబంధించి ఉంటుందని అంటున్నారు. అంటే కేజీఎఫ్ 3 కంటే ముందే అజిత్, నీల్ సినిమా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అజిత్ నటించే సినిమా నుంచే కేజీఎఫ్ 3 కి లీడ్ తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్, అజిత్ కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2026లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుందని టాక్ వినిపిస్తోంది. మరి, టాక్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ న్యూస్ నిజమో కాదో వేచి చూడాలి.