నాగార్జున ది ఘోస్ట్‌ స్పెషల్‌ వీడియో

నాగార్జున ది ఘోస్ట్‌ స్పెషల్‌ వీడియో

టాలీవుడ్​ మన్మథుడు నాగార్జునకు సంబంధించిన ఓ సినిమాపై చర్చ జరుగుతోంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ది ఘోస్ట్​’ (The Ghost) సినిమాలో ‘తమ హగనే’ (Tamahagane) అనే పదం ఏమిటనే దానిపై సినీ ప్రియులు, అభిమానులు ఆరా తీశారు. ది ఘోస్ట్​.. తమ హగనేకు సంబంధించి వీడియో రిలీజ్​అవుతుందని, ఆ పదానికి సంబంధించిన అర్థం తెలుసుకోవాలంటూ చిత్ర యూనిట్​ పేర్కొంది. చెప్పినట్లుగానే గురువారం ఓ వీడియోను రిలీజ్​ చేసింది. తమ హగనే అంటే ‘విలువైన ఉక్కు’ అని అర్థం చెప్పింది. శత్రువులు దాడి చేస్తారని ఓ ఇంట్లో ఉన్న నాగార్జునకు అర్థమౌతుంది. ఓ గదిలోకి వెళ్లి.. అక్కడ ఓ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉక్కు రాయి ఉంటుంది. ఆ రాయిని... మండుతున్న కొలిమిలో వేస్తాడు. కత్తిలాంటి బాక్స్​ లో కరిగిన ద్రవం పడే విధంగా చేస్తాడు. దీనిని నీటిలో వేసి.. పెద్ద కత్తిలాగా తయారు చేస్తాడు.

అనంతరం.. అండర్ వరల్డ్​ కు చెందిన వ్యక్తులు ఇంటిని చుట్టుముట్టారని తెలుసుకుంటాడు. తుపాకితో ట్రాన్స్​ ఫార్మర్ ను పేలుస్తాడు. ప్రవీణ్​ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రాజశేఖర్​తో ఆయన గరుడ వేగ సినిమా రూపొందించారు. ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్రస్తుతం ‘ది ఘోష్ట్’లో నాగార్జున ఇంటర్​పోల్ ​ఆఫీసర్ గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ట్రైలర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్​ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్​ 05వ తేదీన రిలీజ్​కానుంది.