మలయాళంలోకి మిల్క్ బ్యూటీ

మలయాళంలోకి మిల్క్ బ్యూటీ

తెలుగు, తమిళ భాషల్లో నటించి.. మంచి పేరు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ మలయాళ చిత్ర సీమలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే నయనతార, త్రిష ఇతరులు మలయాళం సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. తమన్నా మాత్రం తెలుగు, తమిళ భాషలకు మాత్రమే పరిమితమయ్యారు. మలయాళంలో తమన్నా నటించబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కేరళలో మహా గణపతి ఆలయంలో గ్రాండ్ గా జరిగాయి. తమన్నా లేత గోధుమ రంగు చీర ధరించారు. దిలీప్ సాంప్రదాయ లుంగీ లో మెరిశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అరుణ్ గోపి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. Moviemania ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దిలీప్ సరసన తమన్నా నటించనున్నారు. నటనకు ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ కావడంతోనే ఈ సినిమాను తమన్నా ఒప్పుకుందని టాక్.  నటి భావన మీనన్ వేధింపుల కేసును దిలీప్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇక తమన్నా విషయానికి వస్తే...అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా మెయిన్ లీడ్ గా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మహిళా బౌన్సర్ కథ ఆధారంగా వస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ లో స్పెషల్ డ్యాన్స్ చేయనున్నారు. ‘గుర్తుందా సీతాకాలం మూవీ.. సెప్టెంబర్ 23న విడుదల కానుంది.