Tamannaah: పెళ్లిపై మనసు విప్పిన మిల్కీ బ్యూటీ.. నా జీవిత భాగస్వామి అతడే?

Tamannaah: పెళ్లిపై మనసు విప్పిన మిల్కీ బ్యూటీ.. నా జీవిత భాగస్వామి అతడే?

దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి మిల్కీ బ్యూటీ తమన్నా.  ఇప్పటికీ తనలో  ఏ మాత్రం జోష్ తగ్గలేదు. కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మెప్పిస్తోంది.  గతంలో తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు బాగా ప్రచారమయ్యాయి. కానీ, ఈ వార్తలన్నీ నిరాధారమైనవని రుజువయ్యాయి. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను లీడ్ చేస్తుంది.

లేటెస్ట్ గా ఈ బ్యూటీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌లో డయానా సెంటీ హోస్ట్ చేసే 'డుయూ వన్నా పార్ట్‌నర్‌' ( DoYouWannaPartner ) అనే కార్యక్రమంలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షోలో తమన్నా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, గతంలో మంచి కర్మలు చేసుకున్న వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే, త్వరలోనే తన జీవిత భాగస్వామి గురించి ప్రకటిస్తానంటూ చెప్పి, అభిమానులలో ఉత్సుకతను పెంచారు. ఈ ప్రకటనతో తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.

అయితే, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో చర్చించడం. ఈ అంశంపై తమన్నా మాట్లాడుతూ, తాను తన ప్రాణ స్నేహితులతో వ్యాపారం చేయలేనని స్పష్టం చేశారు. ఆమె తన మేకప్ మహిళ, అలాగే మంచి స్నేహితురాలు అయిన బిల్లీని వ్యాపార భాగస్వామిగా ఒప్పించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యానని చెప్పింది.

►ALSO READ | సుప్రీంకోర్టులో కంగనాకు చుక్కెదురు.. వెనక్కి తగ్గిన బాలీవుడ్ నటి!

దీనికి గల కారణం కూడా తమన్నా వివరించారు. ఎప్పుడూ షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల, స్నేహితులతో కలిసి సమయం గడపడానికి తనకు వీలు పడదని తెలిపారు. తన స్నేహితులు ఆమె కోసం ఎదురుచూడాల్సి వస్తుందని, ఇది స్నేహానికి అడ్డుగా మారుతుందని ఆమె అన్నారు. "ప్రాణ స్నేహితులుగా ఉండటం చాలా మంచిది, కానీ వ్యాపార భాగస్వాములుగా ఉండలేకపోయాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తమన్నా కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె ఇప్పుడు 'రేంజర్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా, 'రోమియో' అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.